schedule Friday, September 11, 2026

అసెంబ్లీలో తాండూరు ప్రజల గొంతుకనైతా..!

calendar_today December 9, 2024
person dharshininews
అసెంబ్లీలో తాండూరు ప్రజల గొంతుకనైతా..!
అసెంబ్లీలో తాండూరు ప్రజల గొంతుకనైతా..! - సమస్యలతో పాటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి - అందరి సహకారంతో విజయోత్సవాలు విజయవంతం - ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపించి.. వాటి పరిష్కారానికి కృసి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈనెల 1 నుంచి 8వ తేది వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన విజయోత్సవ సంబరాలు విజయవంతంగా ముగిశాయి. సోమవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఓ ప్రకటనలో మాట్లాడుతూ విజయోత్సవాలను విజయవంతం చేసిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు, మున్సిపల్, రెవెన్యూ, పోలీసు శాఖలతో పాటు అన్ని శాఖల అధికారులు భాగస్వాములు కావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రజా పాలన వి జయోత్సవాలలో గ్రామా గ్రామాన క్షేత్ర స్థాయిలో పర్యటించడంతో గ్రామాల సమస్యలపై పూర్తి అవగాహన వచ్చిందని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తాండూరు ప్రజల గొంతుకనై పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఇదికూడా చదవండి.. https://www.dharshininews.com/31333/