schedule Friday, September 11, 2026

అస్వస్థతపై ఆరా తీసిన ఎమ్మెల్యే

calendar_today December 10, 2024
person dharshininews
అస్వస్థతపై ఆరా తీసిన ఎమ్మెల్యే
అస్వస్థతపై ఆరా తీసిన ఎమ్మెల్యే - హెల్త్ క్యాంపు ఏర్పాటుకు మనోహర్ రెడ్డి ఆదేశం - విచారణ జరిపి చర్యలకు సిద్దం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్లోని గిరిజన వసతి గృహం విద్యార్థిని అస్వస్థత పై ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆరా తీశారు. ఎంత మంది విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారని, విద్యార్థినిల అస్వస్థతకు గల కారణాలను అధికారులు, నేతల ద్వారా తెలుసుకున్నారు. ఈ మేరకు విద్యార్థినిల ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ద తీసుకొ వాలని సూచించారు. బుధవారం ఉదయం వసతి గృహంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేవించారు. వి ద్యార్థినిలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని అన్నారు. అదేవిధంగా హాస్టల్లో వార్డెన్, నిర్వహకుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా బాధ్యత వహిస్తామని పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై పరిశీలించాలని ప్రజా ప్రతినిధులను, నేతలను ఆదేశించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31380/