schedule Friday, September 11, 2026

శరణు.. శరణు.. శరణం అయ్యప్పా..!

calendar_today December 22, 2024
person dharshininews
శరణు.. శరణు.. శరణం అయ్యప్పా..!
శరణు.. శరణు.. శరణం అయ్యప్పా..! - అంగరంగ వైభవంగా అయ్యప్ప పడిపూజ - పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : శరణు.. శరణు.. శరణం అయ్యప్పా.. అనే శరణు గోషతో తాండూరు పట్టణం శివాజీ చౌరస్తాలోని శ్రీ సాయిమేధా విద్యాలయం మార్మోగింది. ఆదివారం సాయిమేథా స్కూల్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ పూజకు వివిధ ప్రాంతాల నుంచి మాల ధరించిన అయ్యప్ప స్వాములు తరలివచ్చారు. అయ్యప్ప స్వామికి వేద మంత్రొ చ్చరణల మద్య వెంకట్ రెడ్డి అభిషేకాలు చేశారు. భక్తి శ్రద్ధలతో మెట్ల పూజ నిర్వహించారు. ఈ పూజలో అయ్యప్ప స్వామిని కీర్తిస్తూ స్వాములు ఆలాపించిన భజన కీర్తనలు భక్తి పారవశ్యాన్ని నింపాయి. స్వామి వారి పల్లకి సేవ కార్యక్రమం శోభాయామానంగా నిలిచింది. ఈ పడిపూజకు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి హాజరయ్యారు. స్వాములతో కలిసి అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, కాంగ్రెస్ నాయకులు కూడా అయ్యారు. వారితో పాటు తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, తల్లి ప్రమోదిని రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, మాజీ లైబ్రరీ చైర్మన్ మురళీగౌడ్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ తదితరులు కూడా పడిపూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కావలి సంతోష్ కుమార్, బంటు వేణుగోపాల్, బాస్కర్ రెడ్డి, చంద్రశేఖర్ గౌడ్, తిమ్మాయిపల్లి రాజు, స్కూల్ టీచర్లు, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31603/