schedule Friday, September 11, 2026

రూ. 5లక్షలు ఇస్తే భూమి మార్పిడి..!

calendar_today December 23, 2024
person dharshininews
రూ. 5లక్షలు ఇస్తే భూమి మార్పిడి..!
రూ. 5లక్షలు ఇస్తే భూమి మార్పిడి..! - లంచం డిమాండ్ చేసిన తాండూరు ఆర్డీఓ అధికారులు - పక్కా స్కెచ్ వేసి పట్టుకున్న ఏసీబీ ఆఫీసర్స్  తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వం నుంచి వేతనం తీసుకున్న అధికారులు అత్యాశతో అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు కోకొల్లలు. లంచం తీసుకుంటూ అవినీతి అధికారులకు పట్టుబడినా మిగతా అధికారుల్లో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరు సబ్ కలెక్టర్(ఆర్డీఓ) కార్యాలయంలో అధికారులు ఓ భూమి మార్పిడి కోసం రూ. 5లక్షలు డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఆ శాఖ అధికారులు పక్కా స్కెచ్ వేసి అటాక్ చేశారు. దీంతో ఈ అవినీతి అధికారులో బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే... వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం సర్వేనెంబర్ 369 లోని 6 ఎకరాల 26 గుంటలలో  ఎల్ఎఫ్ గా ఉన్న భూమిని పట్టా భూమిగా మార్చేందుకు ఆర్డీఓ కార్యాలయ ఏఓ దానయ్య, సీనీయర్ అసిస్టెంట్ మాణిక్ రావులు రూ. 5లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. సోమవారం సాయంత్రం బాధితుడు అధికారులకు రూ. 5లక్షల నగదు ఇస్తుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు ఇద్దరు అధికారులపై కేసు నమోదు చేసుకుని ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరుస్తామని అధికారులు ప్రకటించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31639/