schedule Friday, September 11, 2026

దేశం గర్వించదగ్గ నేత వాజ్ పేయి

calendar_today December 25, 2024
person dharshininews
దేశం గర్వించదగ్గ నేత వాజ్ పేయి
దేశం గర్వించదగ్గ నేత వాజ్ పేయి - తాండూరులో ఘనంగా సుపరిపాలన దినోత్సవం - మాజీ ప్రధానికి నివాళులు అర్పించిన నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశం గర్వించదగ్గ నేత స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్ పేయి అని తాండూరు బీజేపీ నేతలు అభివర్ణించారు. బుధవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వాజ్ పేయి శత జయంతిని జరుపుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న సుపరిపాలన దినోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. వాజ్ పేయి చిత్రపటానికి పలువురు సీనీయర్ నాయకులు గాజుల శాంతుకుమార్, బాలి శివకుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, జిల్లా కార్యదర్శి బంటారం భద్రేశ్వర్ తదితరులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ దేశానికి మూడు సార్లు ప్రధానిగా పనిచేసిన వాజ్ పేయి ఎన్నో సంస్కరణలు చేసి అజాత శత్రవుగా నిలిచారని కొనియాడారు. దేశం గర్వించదగ్గ నాయకుడుగా అందరు ఆయనను గుర్తించుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళ మోర్చ నాయకురాలు సాహు శ్రీలత, పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం, మోత్కుపల్లి చంద్రశేఖర్, దోమ కృష్ణ, మంతటి రాజు, ప్రహల్లాద్ జాదవ్, రాంచందర్, ప్రభాకర్ గౌడ్, శివాజీ, షాబుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31667/