schedule Friday, September 11, 2026

ఎగ్జీబీషన్లతో ఉత్సహాం, వినోదం..!

calendar_today December 25, 2024
person dharshininews
ఎగ్జీబీషన్లతో ఉత్సహాం, వినోదం..!
ఎగ్జీబీషన్లతో ఉత్సహాం, వినోదం..! - మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ - తాండూరులో ఎంఎస్ వండర్ ట్రేడ్ ఫేయిర్ ఎగ్జీబీషన్ ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎగ్జీబీషన్‌ పట్టణ వాసులకు ఉత్సహాం, వినోదాలు పంచుతాయని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం తాండూరు పట్టణం విలియమూన్ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన ఎంఎస్ వండర్‌ ట్రేడ్ ఫేయిర్ ఎగ్జీబీషన్‌ను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎగ్జీబీషన్‌లో ఏర్పాటు చేసిన పలు ప్రదర్శనలను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఎగ్జీబీషన్లు పెద్దలతో పాటు చిన్నారులకు ఉత్సహాంను అందిస్తాయన్నారు. అంతేకాకుండా వినోదాన్ని పంచుతూ మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయన్నారు. ఒత్తిడిలో ఉన్న వారు ఎగ్జీబీషన్‌కు వచ్చి ఉత్తేజంను పొందవచ్చన్నారు. ఎగ్జీబీషన్‌ నిర్వహకులు ఏర్పాటు చేసిన పలు రకాల వస్తువులు, సామాగ్రిల ప్రదర్శనను పరిశీలించి ఆదరించాలన్నారు. అదేవిధంగా నిర్వహకులు మహమ్మద్ అలీ, సయ్యద్ రహీంలు మాట్లాడుతూ ప్రజల కోసం, చిన్నారుల కోసం అన్ని రకాల ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఎగ్జీబీషన్‌ను తిలకించి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోయరవి, వెంకన్న గౌడ్, ఎగ్జీబీషన్ సభ్యులు షేక్ వసీం తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/31674/