schedule Friday, September 11, 2026

ఎల్లుండి మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ అంత్యక్రియలు

calendar_today January 6, 2025
person dharshininews
ఎల్లుండి మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ అంత్యక్రియలు
ఎల్లుండి మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ అంత్యక్రియలు - కుమారుల రాకకోసం ఎదురుచూపులు - వ్యవసాయ క్షేత్రంలో చివరి మజీలీకి ఏర్పాట్లు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం అంతారం తాండాకు చెందిన మాజీ వార్డెన్ భీమ్లా నాయక్ ఆదివారం తన నివాసంలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. వార్డెన్‌ గా పనిచేసి పదవి విరమణ పొందిన భీమ్లా నాయక్ తాండూరు పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉండగా వారి కుమారులు యూఎస్‌లో ఉంటున్నారు. వారి రాక కోసం కుటుంభీకులు ఎదురు చూస్తున్నారు. బుధవారం వారు స్వదేశానికి వస్తుండడంతో అదే రోజు భీమ్లానాయక్ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతారం తాండాలోని భీమ్లా నాయక్ కుటుంభీకులకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందరితో మనసున్న మహారాజుగా పేరుపోందిన భీమ్లానాయక్ మృతి చెందిపట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతితో కుటుంబంలో విషాధం ఏర్పడింది. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32051/