schedule Friday, September 11, 2026

ఇంటర్ విద్యార్థులకు ఖుషీ కబర్..!

calendar_today January 21, 2025
person dharshininews
ఇంటర్ విద్యార్థులకు ఖుషీ కబర్..!
ఇంటర్ విద్యార్థులకు ఖుషీ కబర్..! - తాండూరులో ఉచిత ఎంసెట్ కోచింగ్ - ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు - మార్చి 15 నుంచి అడ్మిషన్లు, 25 నుంచి తరగతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని ఇంటర్ విద్యార్థులకు ఉచితంగా ఎంసెట్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నట్లు స్థానిక ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు. మంగళవారం పట్టణంలోని అసోసియేషన్ కార్యాలయంలో అధ్యక్షులు కమల్ అతహర్, ఉపాధ్యక్షులు మాట్లాడారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఉచితంగా ఎంసెట్ కోచింగ్ తరగతులు నిర్వహించినట్లు గుర్తుచేశారు. తాజాగా మూడో ఏడాది కూడా ఉచిత ఎంసెట్ కోచింగ్ నిర్వహించేందుకు నిర్ణయించడం జరిగిందన్నారు. ఇంటర్ పూర్తి చేసుకోబోతున్న అన్ని వర్గాల విద్యార్థులకు ఈ తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. ఇందుకోసం మార్చి 15 నుంచి 24వ తేది వరకు అడ్మిషన్లు జరుగుతాయని చెప్పారు. ఆ తరువాత మార్చి 25 నుంచి ఏప్రిల్ 27వ తేది వరకు తరగతులు కొనసాగుతాయన్నారు. అనుభవం ఉన్న అద్యాపకులతో తరగతులు జరుగుతాయన్నారు. ఇప్పటికే అసోసియేషన్ ద్వారా శిక్షణ పొందిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని తెలిపారు. పేద విద్యార్థులు వేల రూపాయిలు ఖర్చు చేసుకోకుండా అసోసియేషన్ ద్వారా ఉచితంగ అందిస్తున్న శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ అబ్దుల్ ఖయ్యూం, ఉపాధ్యక్షులు ఎండీ యూనుస్, అబ్దుల్ సలీం, జాయింట్ సెక్రటరీ ఖయ్యూం పాషలు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32416/