schedule Friday, September 11, 2026

నేతాజీ స్పూర్తితో విద్యాబోధన

calendar_today January 23, 2025
person dharshininews
నేతాజీ స్పూర్తితో విద్యాబోధన
నేతాజీ స్పూర్తితో విద్యాబోధన - విద్యార్థులను భావి పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం - నేతాజీ గురుదేవ్ గురుకుల స్కూల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆశయ సాధనలో భాగంగా విద్యార్థులను భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయడం జరుగుతుందని తాండూరు నేతాజీ గురుదేవ్ గురుకుల పాఠశాల డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలలు అన్నారు. గురువారం స్కూల్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా పాఠశాలలో చిత్రపటం ఏర్పాటు చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేతాజీ ఆశయ సాధనలో భాగంగా 2016 పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయన జయంతిన స్కూల్ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామని తెలిపారు. స్కూల్లో విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలతో పాటు దేశభక్తిని పెంపొందిస్తున్నామన్నారు. భగవద్గీతలో ఉన్న శ్లోకాలను వాటి అర్థాలను బోధిస్తూ చైతన్య పర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32511/