schedule Friday, September 11, 2026

ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తా..!

calendar_today January 24, 2025
person dharshininews
ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తా..!
ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తా..! - సెల్‌ టవర్ ఎక్కి వ్యక్తి హల్ చల్ - దుబ్బాకా మున్సిపల్‌లో ఘటన హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో తనకు ఇళ్లు ఇవ్వకుంటే దూకేస్తానని ఓ వ్యక్తి సెల్‌ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. ఈ సంఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకాలో చోటు చేసుకుంది. శుక్రవారం దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేట గ్రామస్తుడు మైండ్ల రాజు తన పేరును జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ సెల్ టవర్ ఎక్కాడు. గ్రామసభ సమావేశంలో అధికారులు విడుదల చేసిన ఇందిరమ్మ గృహనిర్మాణ పథకం లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఆవేదనకు గురైన రాజు సెల్ టవర్ ఎక్కాడు. అధికారులు తన పేరును జాబితాలో చేర్చకపోతే సెల్ టవర్(Cell tower ) పైనుంచి కింద దూకుతానని బెదిరించాడు. జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ నుంచి కూడా హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అధికారులు, పోలీసులు ఫోన్‌లో మాట్లాడి రాజును కిందకు దింపడానికి ప్రయత్నించారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చే విధంగా చూస్తామని తెలిపినప్పటికీ రాజు సెల్ టవర్ పై నుంచి దిగకపోవడంతో గ్రామంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ గంగరాజు, మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ హామీతో యువకుడు సెల్ టవర్ పైనుంచి కిందికి దిగాడు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32534/