schedule Friday, September 11, 2026

కొత్త కమిటిలతో బీసీల ఉద్యమం బలోపేతం..!

calendar_today January 24, 2025
person dharshininews
కొత్త కమిటిలతో బీసీల ఉద్యమం బలోపేతం..!
కొత్త కమిటిలతో బీసీల ఉద్యమం బలోపేతం..! - చురుకుగా పనిచేసే వారికి పదవులు - రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కందుకూరి రాజ్ కుమార్ - రాజ్ కుమార్ ను అభినందించిన ఆర్. కృష్ణయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ సంఘంలో కొత్త కమిటీలు వేసి బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని ఆ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని బీసీ భవన్ లో జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్.కృష్ణయ్య బీసీల హక్కుల కోసం 50 ఏండ్లుగా పోరాటం చేస్తూ వస్తున్నారని అన్నారు. బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాలన్నారు. ఇందుకోసం బలమైన నాయకత్వాన్ని నిర్మించుకునేందుకు ఆర్. కృష్ణయ్య ఆదేశాల మేరకు త్వరలో కొత్త కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. యువజన సంఘాలు, మహిళ సంఘాలకు కార్యవర్గాలను ఏర్పాటు చేస్తామన్నారు. పనిచేసే వారికి పదవులు అందించి నియమిస్తామన్నారు. మరోవైపు ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్య రాజ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. బీసీల ఉద్యమంలో రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తాండూరు నియోజకవర్గంలోని నాయకులు ఆయన నాయకత్వంలో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ప్రసాద్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జూలపల్లి పల్లి, వికారాబాద్ జిల్లా నాయకులు రవీందర్, నిఖిల్, కృష్ణ, పరుశురాం. అమర్, వెంకటయ్య, సత్యం, వెంకన్న, సాయి కళ్యాణ్, రవీందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32538/