schedule Friday, September 11, 2026

కేవీసీఎస్ లో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు

calendar_today January 26, 2025
person dharshininews
కేవీసీఎస్ లో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు
కేవీసీఎస్ లో అట్టహాసంగా గణతంత్ర వేడుకలు - సాంస్కృతిక ప్రదర్శనలతో అదరగొట్టిన విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్కూల్ విద్యార్థులు సాంస్కృతిక ప్రదర నలతో ఆకట్టుకున్నారు. గణతంత్ర వేడుకల స్ఫూర్తిని నింపుతూ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. అనంతరం విద్యార్థులు స్కూల్ నుంచి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సామూహిక వేడుకలకు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. అక్కడ తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కు గౌరవ వందనం సమర్పించారు. అక్కడ కూడా ప్రదర్శనలు ఇచ్చి ఆకట్టుకున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32579/