schedule Friday, September 11, 2026

ఉత్తమ సేవలతోనే గుర్తింపు..!

calendar_today January 26, 2025
person dharshininews
ఉత్తమ సేవలతోనే గుర్తింపు..!
ఉత్తమ సేవలతోనే గుర్తింపు..! - అధికారులు, సిబ్బంది, కార్మికులకు సన్మానం - సత్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అంకిత భావంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించడ వల్ల గుర్తింపు లభిస్తుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తాండూరు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, కార్మికులకు సన్మానం చేశారు. ఇంజనీరింగ్ విభాగంలో వర్క్ ఇను స్పెక్టర్ మహేష్, కంప్యూటర్ ఆపరేటర్ మధు, వెంకటయ్య, వాటర్ సప్లయ్ నుంచి శ్రీనివాస్, గోరెప్ప, శ్రీనివాస్, జవాన్లు శ్రీను, అటెండర్ మహదేవి, పవన్, పారిశుద్ధ్య కార్మికులు తదితరులను ఘనంగా సన్మానించారు. [caption id="attachment_32597" align="alignnone" width="907"] Oplus_131072[/caption] ఈ సందర్బంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధిలో అధికారులు, సిబ్బంది పనితీరు కీలకలంగా నిలుస్తుందన్నారు. ఉత్తమ సేవలు అందించడంలో వారికే కాకుండా శాఖకు, ప్రాంతానికి గుర్తింపు వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, బోంబీనా, వెంకన్న గౌడ్, సల్మాపాతిమా, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32585/