schedule Friday, September 11, 2026

సీసీ కెమెరాలు చోరీ చేసిన దుండగులు

calendar_today January 26, 2025
person dharshininews
సీసీ కెమెరాలు చోరీ చేసిన దుండగులు
సీసీ కెమెరాలు చోరీ చేసిన దుండగులు - గతయేడాది ఏర్పాటు చేసిన పోలీసు శాఖ - పెద్దేముల్ మండలం నాగుపల్లిలో ఘటన పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : శాంతి భద్రతలు, అసాంఘీక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో కీలకంగా పనిచేసే సీసీ కెమెరాలను గుర్తుతెలియని దుండగులు టార్గెట్ చేశారు. టైం చూసి సీసీ కెమెరాలను లేపేశారు. ఈ సంఘటన ఆదివారం పెద్దేముల్ మండలంలో వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో గత యేడాది అక్టోబర్ 29న గ్రామస్తుల సహాకారంతో గ్రామంలో 31 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. తాజాగా శనివారం 7 సీసీ కెమెరాలు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. గమనించిన గ్రామస్తులు పంచాయతీ కార్యదర్శితో కలిసి పెద్దేముల్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు శేఖర్, నాగిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వారి అక్రమాలకు అడ్డంకిగా వారిందని చోరీ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32594/