schedule Monday, July 06, 2026

సింధూ డిగ్రీ కాలేజీ జైత్రయాత్ర...!

calendar_today January 27, 2025
person dharshininews
సింధూ డిగ్రీ కాలేజీ జైత్రయాత్ర...!
సింధూ డిగ్రీ కాలేజీ జైత్రయాత్ర...! - ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులు - అభినందించిన వ్యవస్థాపకులు రంగారావు, విజయాదేవి తాండూరు, దర్శిని ప్రతినిధి : డిగ్రీ సెమిస్టర్ ఫలితాలలో తాండూరులోని సింధూ డిగ్రీ కళాశాల జైత్రయాత్ర కొనసాగింది. ప్రతి యేడాది డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. తాజాగా సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న అవస్తీ నిఖిత(బీఎస్సీ-ఎంపీసీఎస్) 9.68, వేధిక మిశ్రా(బీకాం) 9.52, జబీన్ ఫాతిమా (బీజెడ్సీ) 9.12, సబియానా (బీబీఏ) 9.24, సాహెరా భేగం(బీఏ) 9 పాయింట్లతో సత్తా చాటారు. ఈ సందర్భంగ సోమవారం కళాశాలలో సంబరాలు జరుపుకున్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో కళాశాల వ్యవస్థాపకులు రంగారావు, ప్రిన్సిపల్ విజయాదేవిలు కేక్ కట్ చేయించారు. ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాశాల విద్యార్థులు ప్రతిభను కనబరచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారని, విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడమే కళాశాల లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ అమరేందర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32617/