schedule Friday, September 11, 2026

బీసీ స్మశాన వాటికలకు రాజయోగం తెద్దాం..!

calendar_today January 27, 2025
person dharshininews
బీసీ స్మశాన వాటికలకు రాజయోగం తెద్దాం..!
బీసీ స్మశాన వాటికలకు రాజయోగం తెద్దాం..! - నేతలు, అధికారులతో కొట్లాది నిధులు సాదిద్దాం - యువకులు, కుంఘాల పెద్దలు ముందుకురావాలి - బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని బీసీ స్మశాన వాటికలకు రాజయోగం తెచ్చేందుకు ఉద్యమించాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. సోమవారం తాండూరు పట్టణం సీతారాంపేట్ లోని ఎస్సీ స్మశాన వాటిక, పాత తాండూరు బోనమ్మ గుడి వద్ద ఉన్న బీసీ స్మశాన వాటికలను సందర్శించారు. స్థానిక యువనాయకులతో మాట్లాడి స్మశాన వాటికల స్థితి గతులను, సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించి స్మశాన వాటికల అభివృద్ధిపై దృష్టిసారించాలని కోరారు. తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో స్మశాన వాటికలు వైకుంఠదామాలుగా ఏర్పడితే తాండూరులో మాత్రం అడిగే దిక్కులేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని స్మశాన వాటికలకు రాజయోగం తీసుకవచ్చేందుకు యువకులు, నేతలు ఉద్యమించాల్సిన అవసరముందున్నారు. స్మశాన వాటికలకు నిధులు కేటాయించేలా నేతలు, అధికారులతో కోట్లాడుదాం అని అన్నారు. నిధులు సాధించుకుని పక్కా ప్రణాళికలతో స్మశాన వాటికలను అభివృద్ధి పరుచుకుందామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రం శ్రీధర్, రాము ముదిరాజ్, గిరిజాపురం రమేష్, జుంటుపల్లి వెంకట్, దుబాయ్ వెంకట్, శ్రీనివసా, శివకుమార్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32622/