schedule Friday, September 11, 2026

బంటు మల్లప్పను సన్మానించిన పాదయాత్ర భక్తులు

calendar_today January 27, 2025
person dharshininews
బంటు మల్లప్పను సన్మానించిన పాదయాత్ర భక్తులు
బంటు మల్లప్పను సన్మానించిన పాదయాత్ర భక్తులు - శ్రీశైలం మల్లన్న ప్రసాదం అందజేత తాండూరు,దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ కు చెందిన కాంగ్రెస్ నేత బంటు మల్లప్పను శ్రీశైలం పాద యాత్ర భక్తులు సన్మానించారు. ఈనెల 16న ఉమా మహేశ్వర సమితి ఆధ్వర్యంలో తాండూరు నుంచి శ్రీశైలంకు మహా పాదయాత్ర చేపట్టారు. పాదయాత్ర భక్తులకు బంటు మల్లప్ప తన వంతుగా ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల పాదయాత్ర పూర్తి చేసుకుని తాండూరుకు చేరుకున్న భక్తులు సోమవారం బంటు మల్లప్పను ఆయన నివాసం వద్ద కలిశారు. పాదయాత్ర సంపూర్ణంగా పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆర్థిక సాయం అందజేసిన మల్లప్పను వారు శాలువాతో సత్కరించారు. శ్రీశైలం నుంచి తీసుకవచ్చిన ప్రసాదంను మల్లప్పకు అందజేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు బంటు మల్లప్ప కుటుంబానికి మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32629/