schedule Friday, September 11, 2026

వాహ్.. అన్షారా కొనైనే..!

calendar_today February 3, 2025
person dharshininews
వాహ్.. అన్షారా కొనైనే..!
వాహ్.. అన్షారా కొనైనే..! - జాతీయ ఒలంపియాడ్‌తో అద్బుత ప్రతిభ - అభినందించిన స్కూల్ యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : చదువుతోంది.. నాలుగో తరగతి.. అయినా తన ప్రతిభతో వాహ్.. అనిపించకుంది. అన్షారా కోనైనే అనే బాలిక. జాతీయ స్థాయిలో జరిగిన ఒలంపీయాడ్ పరీక్షల్లో అద్బుత ప్రతిభను కనబరించింది. తాండూరు పట్టణం విశ్వంబర కాలనీ అబ్దుల్ ఖయ్యుం కూతురు అన్షారా కోనైన్ పట్టణంలోని సెయింట్ మార్క్స్ జూబ్లీ ఇంటర్నెషనల్ స్కూల్లో 4వ తరగతి చదువుతోంది. నెల రోజుల క్రితం యునైటేడ్ కౌన్సిల్‌ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఒలంపీయాడ్ పరీక్షలో అన్షారా కొనైన్ పాల్గొంది. రెండు రోజుల క్రితం విడుదలైన ఫలితాల్లో అన్షారా జాతీయ స్థాయిలో 398 ర్యాంకు సాధించి సత్తా చాటింది. దీంతో అన్షారాకు మెడళ్లు, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యార్థి అన్షారా ఒలంపీయాడ్‌లో సత్తా చాటడంతో స్కూల్ యజమాన్యం, ప్రతినిధులు అన్షారాను అభినందించారు. అదేవిధంగా తమ కూతురు ఒలంపీయాడ్‌లో ప్రతిభను కనబరచడం పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32784/