schedule Friday, September 11, 2026

నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..!

calendar_today February 5, 2025
person dharshininews
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..!
నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్..! - వికారాబాల్ జిల్లా సఖి కేంద్రంలో ఉద్యోగాలు - ప్రకటించిన కేంద్రం పీడీ వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని నిరుద్యోగులకు మహిళ, శిశు, దివ్యాంగులు, సీనీయర్ సిటిజన్ శాఖ సఖీ కేంద్రం ప్రతినిధులు శుభవార్త చెప్పారు. జిల్లాలోని సఖీ కేంద్రంలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తి చేసేందుకు నోటీఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రంలో కంప్యూటర్ అపరేటర్, సెక్యూరిటీగార్డ్(షిప్ట్ వైస్) ఉద్యోగాలను భర్తి చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్, సఖీ ఓఎస్సీ ప్రకటించారు. కంప్యూటర్ ఆపరేటర్ కోసం బీకాం కంప్యూటర్, ఎంకాం, ఎంబీఏ అర్హతతో పాటు రాష్ట్ర స్థాయి సంస్థల్లో కనీసం 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలన్నారు. సెక్యూరీటీ గార్డు కోసం ఇంటర్ అర్హతతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో 3 సంవత్సరాలు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలన్నారు. అసక్తిగల అభ్యర్థులు ఈనెల 8వ తేది లోపు ప్రాజెక్టు డైరెక్టర్, అనంతగిరి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని, 12న షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వూలు నిర్వహించడం జరుగుతుందన్నారు. పూర్తి వివరాలకు 9652807354కు సంప్రదించాలలని సూచించారు. దరఖాస్తులను ఆన్‌ లైన్‌లో కూడా స్వీకరించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32831/