schedule Friday, September 11, 2026

ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి

calendar_today February 5, 2025
person dharshininews
ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి
ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలి - నామినేటేడ్ పదవుల్లో అవకాశం కల్పించాలి - ఐక్య వేధిక సమ్మేళనంలో ఉద్యమకారుల విజ్ఞప్తి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ కోసం కష్టపడి ఉద్యమించిన ఉద్యమ కారులకు ప్రభుత్వం గుర్తింపు ఇవ్వాలని తాండూరు తెలంగాణ ఉద్యమ కారులు అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలో తెలంగాణ ఐక్య వేధిక ఆధ్వర్యంలో ఉద్యమ కారుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కారణాలతో చనిపోయిన ఉద్యమకారులకు స్మరించుకుని నివాళులు అర్పించారు. అనంతరం పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన పలు సందర్భాలను గుర్తుచేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నామినేటేడ్ పదవులు ఇస్తామని, సముచిత స్థానం కల్పిస్తామని హామి ఇచ్చిందని తెలిపారు. 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పిందని తెలిపారు. ఇచ్చిన హామిని నెరవేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు సంజయ్ గౌడ్, కేశవులు, జిలాని, యు.రమేష్ కుమార్, కమల్ అతహర్, ఫిరోజ్ ఖాన్, పర్యాద రామకృష్ణ, వాజిద్, శ్రీనివాస్ రెడ్డి, మోయిజ్, అబేద్, చావుస్, బంటారం భద్రేశ్వర్, కృష్ణ ముదిరాజ్, గోవింద్ రావు, లక్ష్మణ్, గౌస్, మల్లేష్, వెంకట్, శివ, ఎస్ఐసీ నర్సింలు, పాష, నరేష్, కమల్, మహేష్, లెక్చరర్స్ బసంత్, మహేందర్ రెడ్డి, వెంకట్, రాములు, మక్సూద్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి...  https://www.dharshininews.com/32861/