schedule Monday, July 06, 2026

శభాష్‌.. నవనీత..!

calendar_today February 8, 2025
person dharshininews
శభాష్‌.. నవనీత..!
శభాష్‌.. నవనీత..! - జాతీయ క్రీడాకారిణికి డా.సంపత్ కుమార్‌ అభినందనలు - ఇంటర్నేషనల్‌ పోటీకి తన వంతు తోడ్పాటుకు హామి తాండూరు, దర్శిని ప్రతినిధి : శభాష్‌ నవనీత... ఇంటర్నేషనల్ పోటీలో కూడా సత్తా చాటాలని తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డా. సంపత్ కుమార్ అభినందించారు. జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్‌ సాధించి ఇంటర్నేషనల్ పోటీలకు ఎంపికైన సందర్భంగా ఆమెను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం 5వ వార్డుకు ఇందిరానగర్‌కు చెందిన నవనీత అనే మహిళల గత నెల 31 నుంచి ఈనెల 2వ తేది వరకు కేరళలోని త్రిశూర్‌లో జరిగిన మాస్టర్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌-2025 జాతీయ స్థాయి పోటీలో పాల్గొంది. 35 నుంచి 40 ఏండ్ల విభాగంలో 1.25 హై జంప్‌లో పాల్గొని మొదటి స్థానంలో నిలిచింది. దీంతో నవనీతకు గోల్డ్ మెడల్ అందించారు. ఈ విషయం తెలుసుకున్న డా.సంపత్ కుమార్ శనివారం ఇందిరానగర్‌ వెళ్లి నవనీతను శభాష్‌ అంటూ అభినందించారు. శాలువాతో ఘనంగా సన్మానించారు. త్వరలో ఇండోనేషియాలో జరిగే ఇంటర్నేషనల్ అథ్లెటిక్ పోటిలో నవనీతకు కావాల్సిన అన్ని సౌకర్యాలు బీవీజీ ఫౌండేషన్ ద్వారా అందించి తమవంతు తోడ్పాటు అందిస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బోయ రవి, వార్డు పెద్దలు, మహిళలు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/32956/