schedule Friday, September 11, 2026

యువత ఆదర్శవంత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి

calendar_today March 2, 2025
person dharshininews
యువత ఆదర్శవంత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి
యువత ఆదర్శవంత ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలి - బీసీల హక్కుల కోసం యువజన సంఘం సత్తా చూపించాలి - బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ - గొట్లపల్లిలో బీసీ యువజన కార్యవర్గ సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా యువత ఆదర్శవంతమైన ఉద్యమాలకు సిద్ధంగా ఉండాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండల బీసీ యువజన సంఘం అధ్యక్షులు నవీన్ ఆధ్వర్యంలో గొట్లపల్లిలో బీసీ యువజన కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కందుకూరి రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత దుర అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు. దేశంలో అందరి హక్కుల కోసం పోరాడే శక్తి యువతలో ఉందన్నారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య నేతృత్వంలో యువత బీసీ హక్కుల సాధనకు కృషి చేయాలన్నారు. https://www.dharshininews.com/33594/ బీసీల జీవితాలు తిరగరాసే శక్తి యువతలో ఉందన్నారు. రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ఆదర్శవంతమైన ఉద్యమాలకు యువత సిద్ధంగా ఉండాలన్నారు. బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, మండల అధ్యక్షలు శ్రావణ్ కమార్, మండల అధ్యక్షురాలు శివలీల, నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ లు మాట్లాడుతూ బీసీల రాజ్యాధికారం కోసం విద్యార్థి నాయకులు, యువకులు చురుకుగా పాల్గొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బహుజన విద్యావేత్త అరుణ్ రాజ్, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, మల్లన్న, నారాయణ, చంద్రప్ప, గోరే పటేల్, రఫీక్, రాంరెడ్డి, ఇస్మాయిల్, కురవ శేఖర్, కురువ శ్రీశైలం, తలారీ గోరేప్ప, ఇర్ఫాన్, వెంకటేష్, మొగులప్ప, జనార్దన్, బాలరాజ్, అంజి, రాములు, లక్ష్మప్ప, శ్రీను, సాయిలు, ఫయాజ్, రియాజ్, ఆసిఫ్, చంద్రమ్మ, నర్సమ్మ, గంగమ్మ, బసప్ప, చంద్రమ్మ, మారుతమ్మ, పద్మమ్మ, సరోజన, ఫీరంబీ, రోషన్ బీ, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33616/