schedule Friday, September 11, 2026

భరత్‌ భూషణ్‌ కన్నుమూత..!

calendar_today March 4, 2025
person dharshininews
భరత్‌ భూషణ్‌ కన్నుమూత..!
భరత్‌ భూషణ్‌ కన్నుమూత..! - మహేందర్ రెడ్డి అనుచరుడుగా గుర్తింపు - ఆ దేవాయాలకు చైర్మన్‌గా పదవులు - మృతిపై పలువురు నాయకుల విచారం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన సీనీయర్ నాయకులు భరత్‌ భూషణ్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కుటుంభీకులు పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం ఉదయం భరత్‌ భూషణ్‌ అనారోగ్యంలోనే గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. భరత్‌ భూషణ్‌ తాండూరులో సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని కలిగి ఉన్నారు. ఎమ్మెల్సీ, చీఫ్‌ విఫ్‌ పట్నం మహేందర్ రెడ్డి తాండూరుకు వచ్చిన తొలి నాళ్ల నుంచి భరత్‌ భూషణ్‌ ఆయన వెంబడి కొనసాగారు. టీడీపీ నుంచి టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలో వెంబడి నడిచారు. మహేందర్ రెడ్డితో భరత్‌ భూషణ్ తత్సంబాలను కలిగి ఉన్నారు. ఆయన హయాంలోనే తాండూరు పట్టణంలోని కాళికాదేవి దేవాలయ చైర్మన్‌గా పనిచేశారు. అదేవిధంగా పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవాలయ చైర్మన్‌గా కూడా పనిచేశారు. ఆయన కుమారులు కూడా మహేందర్ రెడ్డికి విధేయులుగా ఉన్నారు. భరత్‌ భూషణ్‌ మరణం పట్ల తాండూరు పట్టణానికి చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ నేతలతో పాటు పలు పార్టీల నేతలు, వివిధ సంఘాల నాయకులు విచారం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు తాండూరు పట్టణంలోని రుద్రభూమిలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయని కుటుంభీకులు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33713/