schedule Friday, September 11, 2026

భరత్ భూషణ్ కు నివాళులు..!

calendar_today March 4, 2025
person dharshininews
భరత్ భూషణ్ కు నివాళులు..!
భరత్ భూషణ్ కు నివాళులు..! - నివాళులు అర్పించిన చీఫ్ విఫ్ మహేందర్ రెడ్డి - కుటుంబానికి పరామర్శ, మనోధైర్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంకు చెందిన సీనీయర్ రాజకీయ నాయకులు బిర్కడ్ భరత్ భూషణ్ కు పలువురు ఘన నివాళులు అర్పించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న భరత్ భూషణ్ పట్టణంలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందున్నారు. మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న చీఫ్ విఫ్ |మహేందర్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. భరత్ భూషణ్ భౌతిక ఖాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. మహేందర్ రెడ్డితో పాటు నాయకులు కరణం పురుషోత్తంరావు, అబ్దుల్ రవూఫ్, ఆర్. బస్వరాజ్, పి. బస్వరాజ్ తో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కూడా నివాళులు అర్పించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని రుద్రభూమిలో భరత్ భూషణ్ అంత్యక్రియలు నిర్వహించారు. తాండూరులో సుదీర్ఘ రాజకీయ నేతగా ఉన్న భరత్ భూషణ్ మొదటి నుంచి మహేందర్ రెడ్డి అనుచరుడుగా గుర్తింపు పొందారు. టీడీపీ, టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన వెంటే ఉన్నారు. భరత్ భూషణ్ కుమారులు సైతం మహేందర్ రెడ్డికి విధేయులగా ఉన్నారు. భరత్ భూషణ్ కోడలు బిర్కడ్ ఉశ మున్సిపల్ కౌన్సిలర్ గా, కోఆప్షన్ సభ్యురాలుగా పదవులు చేపట్టారు. కుమారుడు బిర్కడ్ రఘు యువనాయకులుగా కొనసాగుతున్నారు. భరత్ భూషణ్ మృతి పట్ల పలువురు కుటుంభానికి సానుభూతి తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33726/