schedule Friday, September 11, 2026

జర్నలిస్టుల భూమిని సర్వే చేయించండి

calendar_today March 4, 2025
person dharshininews
జర్నలిస్టుల భూమిని సర్వే చేయించండి
జర్నలిస్టుల భూమిని సర్వే చేయించండి - తాండూరు తహసీల్దార్‌తో టీయూడబ్ల్యూజే - ఐజేయూ నేతలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : జర్నలిస్టులు కొనుగోలు చేసిన భూమిలో సర్వే చేయించాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ను టీయూడబ్ల్యూజే- ఐజేయూ నేతలు కోరారు. మంగళవారం టీయూడబ్ల్యూజే - ఐజేయూ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పట్లోళ్ల వేణుగోపాల్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి, నియోజకవర్గ అధ్యక్షులు పెరుమాళ్ల వెంకట్ రెడ్డి, సీనీయర్ జర్నలిస్టులతో కలిసి తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ను కలిశారు. తాండూరు మండలం అంతారం గ్రామ శివారులోని సరె ్వనెంబర్ 116, 117లో గత కొన్నేళ్ల క్రితం ఇతరుల వద్ద ప్రవేటు స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ స్థలంలో ఇతర యజమానుల రికార్డులు చూపిస్తున్నాయని, రికార్డులో ఓ చోట ఉంటే.. భూమి మరో చోట చూపిస్తుందని తహాసీల్దార్ కు వివరించారు. కావున సమస్యను పరిష్కరించేందుకు సర్వే చె యించాలని కోరారు. ఇందుకు తహాసీల్దార్ తారాసింగ్ స్పందిస్తూ మండల సర్వేయర్ మహేష్ సెలవులో ఉన్నారని, ఆయన రాగానే సర్వే చేయిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనీయర్ జర్నలిస్టులు ప్రభాకర్, లింగేష్, శివానంద్, యాస వెంకట్రామ్ రెడ్డి, కె.శాంతు, సంగమేశ్వర్ తదితరులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33735/