schedule Monday, July 06, 2026

మహిళ పోలీసుల సేవలు ఆదర్శనీయం

calendar_today March 8, 2025
person dharshininews
మహిళ పోలీసుల సేవలు ఆదర్శనీయం
మహిళ పోలీసుల సేవలు ఆదర్శనీయం - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - డివిజన్ మహిళ పోలీసులు, సిబ్బందికి సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని రంగాలతో పాటు పోలీసు శాఖలో మహిళల విధులు, సేవలు ఆదర్శనీయమని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సబ్ డివిజన్ లోని తాండూరు పట్టణం, కరణ్ కోట్, బషీరాబాద్, పెద్దేముల్, యాలాల పోలీస్టేషన్లలో పనిచేస్తున్న ట్రైనీ ఎస్ఐలు, మహిళ కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ మహిళలు కృషి, పట్టుదల, ఓర్పు, సహనానికి ప్రతీకగా నిలుస్తారని అన్నారు. వివిధ రంగాల్లో మహిళలు రాణించడం గొప్ప విషయమన్నారు. పోలీసు శాఖలో పనిచేస్తూ శాంతి భద్రతల పరిరక్షణతో పాటు తోటి మహిళకు భరోసా, ధైర్యం అందించేలా మహిళ పోలీసులు సేవలు ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ నగేష్, ఆయా పోలీస్టేషన్ల ఎస్ఐలు గిరి, శంకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33870/