schedule Monday, July 06, 2026

నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్..!

calendar_today March 13, 2025
person dharshininews
నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్..!
నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్..! - తాండూరులో మెగా జాబ్ మేళా - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ మహిళలకు సూపర్ చాన్స్ అందిస్తున్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రముఖ MNC కంపెనీ ఫాక్స్ కాన్ వారి సౌజన్యంతో ఈనెల 16న ఆదివారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు జాబ్ మేళా కొనసాగుతుంది. ప్రముఖ ఎంఎన్సీ కంపెనీ ఫాక్స్ కాన్ వారి సహాకారంతో నిరుద్యోగ మహిళలకు ఉద్యోగ అవకాశాలను కల్పించబోతున్నారు. పదవ తరగతి, ఇంటర్ డిగ్రీ చదివిన మహిళలు, అమ్మాయిలు అర్హులు. జాబ్ మేళాకు వచ్చే మహిళలు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్, రెండు పాస్ ఫోటో సైజ్ ఫోటోలు తీసుకరావాల్సి ఉంటుందని, పూర్తి వివరాలకు సెల్ : 9739693954, 8688547057, 9100491109లకు సంప్రదించాలని నిర్వహకులు సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33954/