schedule Friday, September 11, 2026

స్పూర్తిదాయకురాలు కవయిత్రి మొల్ల..!

calendar_today March 13, 2025
person dharshininews
స్పూర్తిదాయకురాలు కవయిత్రి మొల్ల..!
స్పూర్తిదాయకురాలు కవయిత్రి మొల్ల..! - ఆమె ఆశయాలతో ముందుకు సాగాలి - టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ - అంతారంలో ఘనంగా జయంతి ఉత్సవాలు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : రామాయణాన్ని తెలుగులో రచించిన తొలి కవయిత్రి మొల్ల సమాజనికి స్పూర్తి దాయకురాలు అని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మాజీ జెడ్పీటీసీ ధారాసింగ్ అన్నారు. గురువారం తాండూరు మండలం అంతారం గ్రామంలో తాండూరు నియోజకవర్గ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో మొల్ల జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీటీసీ ధారాసింగ్ సంఘం నాయకులు, గ్రామస్తులతో కలిసి మొల్ల విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ధారాసింగ్ మాట్లాడుతూ కవయిత్రి మొల్ల అందరికి ఆదర్శప్రాయురాలు అని, తెలుగులో రామాయణంను రచించి సమాజానికి స్పూర్తిగా నిలిచారని అన్నారు. ఆమె ఆశయాలతో అందరు ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా కుమ్మరులు తమ కులవృత్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కుమ్మరుల అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో కృషి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు అంజయ్య, నియోజకవర్గ అధ్యక్షులు కుమ్మర పాండు, ప్రధాన కార్యదర్శి అనంతయ్య, తెలంగాణ మాస్టర్ ట్రైనర్ శంకర్, నర్సింలు, సత్యప్ప, పండరి, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/33965/