schedule Thursday, September 10, 2026

ఇష్టంగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి

calendar_today March 18, 2025
person dharshininews
ఇష్టంగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి
ఇష్టంగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి - తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి - అట్టహాసంగా నెంబర్ 1 స్కూల్ వార్షికోత్సవం - మైమరిపించిన విద్యార్థుల నృత్య ప్రదర్శనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇష్టంగా చదువుకుని నచ్చిన రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదగాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్‌లోని ప్రభుత్వ నెంబర్ 1 ఉన్నత పాఠశాలలో 74వ వార్షికోత్సవం ప్రధానోపాధ్యాయులు శివకుమార్ సార్ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి డీఎస్పీ బాలకృష్ణ రెడ్డి మున్సిపల్ మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలుతో కలిసి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులకు సలహాలు, సూచనలు అందజేశారు. విద్యార్థులు క్రమశిక్షణగా ఉంటూ ఇష్టంగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చదువు, క్రమశిక్షణ ద్వారా జీవితంలో పై స్థాయికి ఎదగవచ్చని అన్నారు. ఇష్టంగా చదివి నచ్చిన రంగాలలో రాణించాలని అన్నారు. అదేవిధంగా పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థుల ఆట పాటలు, నృత్య ప్రదర్శనలు మైమరిపించాయి. మరోవైపు వనజ స్కూల్ పదో తరగతి విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో AAPC చైర్మన్ కరీమా బేగం, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34049/