schedule Friday, September 11, 2026

ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలి..!

calendar_today March 24, 2025
person dharshininews
ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలి..!
ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలి..! - వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్ - జెడ్పీలో 16 మందికి కారుణ్య నియామక పత్రాలు అందజేత వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని అదనపు కలెక్టర్, జడ్పి సిఇవో సుధీర్ కుమార్ అన్నారు. జిల్లా పరిషత్ ద్వారా 16 మంది అర్హులకు సోమవారం కారుణ్య నియమక పాత్రలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ , పంచాయతి రాజ్ శాఖలో ఖాళీలు లేక దీర్ఘకాలంగా కారుణ్య నియామకాలు చేపట్టలేదన్నారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క లు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అటెండెర్ పోస్టులను జూనియర్ అసిస్టెంట్లు గా అప్ గ్రేడ్ చేసి కారుణ్య నియామకాలను చెప్పట్టడం జరిగిందని చెప్పారు. జిల్లా పరిషత్ వికారాబాద్లో మొత్తం 16 మందికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. వీరు ప్రజలకు నాణ్యమైన సేవలు అందిచేందుకు కృషి చేయాలని ఆయన సూచించారు. పంచాయతీ రాజ్ మినిస్టీరియల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందకుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు. సంవత్సరాల తరబడి ఈ నియమాలను చేపట్టాలని ప్రభుత్వం పై తీవ్ర వత్తిడి తీసుకుని రావడంతో ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్ శాఖ మాత్యులు ప్రత్యేక చోరవతో ఈ నియమకాలను అందిచడం చాలా గొప్ప విషయమని దీనికి వారికి సంగం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సంగం జిల్లా అధ్యక్షుడు రాజేందర్, జిల్లా పరిషత్ సిబ్బంది చంద్ర శేఖర్, వినయ్ కుమార్, బెన్నీ, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34215/