schedule Thursday, September 10, 2026

ఘనంగా ఇఫ్తార్ విందు

calendar_today March 25, 2025
person dharshininews
ఘనంగా ఇఫ్తార్ విందు
ఘనంగా ఇఫ్తార్ విందు - రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు - భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులు - పాల్గొన్న తండ్రి విఠల్ రెడ్డి, బాబాయ్ శ్రీశైల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందు ఘనంగా జరిగింది. రంజాన్ మాసం సందర్భంగా రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం తాండూరు పట్టణం చెనష్పూర్ రోడ్డు మార్గంలోని క్లాసిక్ గార్డెన్లో ఇఫ్తార్ వి ందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోహిత్ రెడ్డి తండ్రి, బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు విఠల్ రెడ్డి, బాబాయ్, రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైల్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ ఇఫ్తార్ విందుకు తాండూరు పట్టణంలో పాటు వివిధ మండలాలకు చెందిన ముస్లిం సోదరులు భారీ ఎత్తున తరలివచ్చారు. విఠల్ రెడ్డి, శ్రీశైల్ రెడ్డి, పార్టీ నేతలు ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు ముస్లిం సోదరులకు పలహారాలు తినిపించి ఉపవాస దీక్షలను విరమింప జేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రంజాన్ పండగలో భాగంగా నిర్వహించే ఇఫ్తార్ విందులు మతసామరస్యతను చాటుతాయన్నారు. పండగను అందరు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), మండలాల అధ్యక్షులు నర్సిరెడ్డి, వీరేందర్ రెడ్డి, పాండురంగా రెడ్డి, మైనార్టీ పెద్దలు యూనుస్ ఖాన్, కమల్ అతహర్, ఖుర్షీద్ హుస్సేన్, ముస్తఫా పటేల్, ముక్తార్ నాజ్, సయ్యద్ షుకూర్, మైనార్టీ సోదరులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34252/