schedule Friday, September 04, 2026

వశిష్ఠకు మరో రూ. 21 వేలు ఆర్థిక సాయం

calendar_today March 26, 2025
person dharshininews
వశిష్ఠకు మరో రూ. 21 వేలు ఆర్థిక సాయం
వశిష్ఠకు మరో రూ. 21 వేలు ఆర్థిక సాయం - అందజేసిన తాండూరు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ తాండూరు, దర్శిని ప్రతినిధి : కాలేయ వ్యాధితో బాధపడుతున్న 10 నెలల బాలుడు వశిష్ఠకు మరో రూ. 21 వేల ఆర్థిక సాయం అందింది. యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన భానుప్రియ, శివకుమార్ దంపతుల కుమారుడు F వశిష్ట అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి ఆపరేషన్ నిర్వహించేందుకు రూ. 23లక్షలు ఖర్చవుతుండడంతో ఆర్థిక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి స్ఫూర్తితో బాలుడికి ఆర్థిక సాయం అందుతోంది. తాజాగా బుధవారం శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో తాండూరు ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు రూ.21 వేల ఆర్థిక సాయం అందజేశారు. దాతలు బాలుడు ఆపరేషన్ కోసం తోచిన సహాయం అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బంటు మల్లప్ప, జోషి వికాస్, ఫర్టిలైజర్స్ అసోసియేషన్ సభ్యులు, వ్యాపారులు ఉన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34271/