schedule Thursday, September 10, 2026

ఉచిత ఎప్ సెట్ కు అనూహ్య స్పందన

calendar_today March 28, 2025
person dharshininews
ఉచిత ఎప్ సెట్ కు అనూహ్య స్పందన
ఉచిత ఎప్ సెట్ కు అనూహ్య స్పందన - శిక్షణలో 175 మంది బాలికలకు ప్రవేశం - అభినందిస్తున్న విద్యావేత్తలు..తల్లిదండ్రులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సేవా భారతీ, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో తాండూరులో బాలికల కొరకు చేపట్టిన ఉచిత ఎప్ సెట్(ఎంసెట్) శిక్షణకు అనూహ్య స్పందన వచ్చింది. ఈనెల 23న ఉచిత శిక్షణను ఆర్ బిఓఎల్ ఎండీ(మేనేజింగ్ డైరెక్టర్) సరళా శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. 24 నుంచి తాండూరులోని భాష్యం జూనియర్ కాలేజీలో తరగతులు కొనసాగుతున్నాయి. మొదట 100 మంది బాలికలకు మాత్రమే శిక్షణ ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించగా..విద్యార్థినిల నుంచి తాకిడి ఎక్కువగా ఉండడంతో ప్రవేశాలు 175కు చేరుకున్నాయి. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత ఎప్ సెట్ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. సేవా భారతీ, హిందూ ధార్మిక పరిషత్ చేపట్టిన ఈ కార్యక్రమంపై విద్యావేత్తలు, బాలికల తల్లిదండ్రులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు చక్కటి కార్యక్రమం చేపట్టారని ప్రముఖ విద్యావేత్త రంగారావు, విజయాదేవి దంపతులు కొనియాడారు. శిక్షణ తరగతులను వారిద్దరు సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి తమ సహకారం ఉంటుందని హిందూ ఉత్సవ కేంద్ర సమితి తాండూరు విభాగం ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు పేర్కొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34283/