schedule Wednesday, September 09, 2026

ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తు

calendar_today April 2, 2025
person dharshininews
ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తు
ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తు - ఎసెంచర్ ఐటీ మేనేజర్, వక్త చల్లా శ్రీధర్ రెడ్డి - ఉత్సాహాంగా శాలివాహాన విద్యార్థుల వీడ్కోలు సమావేశం తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు ఆంగ్లంలో పట్టు సాధిస్తే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని ఎసెంచర్ ఐటీ సంస్థ మేనేజర్, ప్రేరణ వికాస వ్యక్త చల్లా శ్రీధర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు శాలివాహన డిగ్రీ కాలేజీలో తృతీయ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చల్లా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఆంగ్ల భాషపై పట్టుసాధించాలని అన్నారు. అందులో ప్రావిణ్యం పొందితే సాఫ్ట్ వేర్ రంగాల్లో ఉద్యోగాలను సాధించవచ్చని అన్నారు. ఐటీ రంగంలో ఉద్యోగాలకు ఎల్డీఏ సూత్రాన్ని పాటించాలన్నారు. ఎల్ అంటే నేర్చుకోవడం, టీ అంటే నైపుణ్యం, ఏ అంటే పట్టుదల అని వివరించారు. తల్లిదండ్రులను, సేవాతత్పరులను విద్యార్థులు మార్గదర్శకంగా తీసుకోవాలన్నారు. అప్పుడే ఉన్నతంగా ఎదుగుతారని అన్నారు. అదేవిధంగా ప్రిన్సిపల్ శరత్ చంద్ర మాట్లాడుతూ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. మరోవైపు తృతీయ సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సందర్భంగా కాలేజీ విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు కల్వ రాధాకృష్ణ, డైరెక్టర్ మోముల మాణిక్యం, బంటారం సుధాకర్, నాగారం మల్లేశం, సిద్ధలింగయ్య, బసంత్, అద్యాపకులు, సిబ్బంది. విద్యార్థులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/34448/