schedule Friday, September 04, 2026

కార్డు లేకున్నా... స్కాన్‌ చేస్తే చాలు..!

calendar_today April 9, 2025
person dharshininews
కార్డు లేకున్నా... స్కాన్‌ చేస్తే చాలు..!
కార్డు లేకున్నా... స్కాన్‌ చేస్తే చాలు..! - క్షణాల్లో ఆధార్ వెరిఫికేషన్ - త్వరలో అందుబాటులోకి కొత్త యాఫ్ - ఎలా పనిచేస్తుందంటే..? దర్శిని డెస్క్ : దేశంలో ప్రతి ఒక్కరికి వద్ద ఆధార్‌ కార్డు ఉంటుంది. మన గుర్తింపును చూపుకునేందుకు వివిధ సందర్భాలలో.. ఆధార్ చూపించాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఇందుకోసం ఆధార్‌కార్డును వెంట పెట్టుకుని ఉంటారు. త్వరలో ఇలాంటి కష్టాలకు చెక్ పడుతోంది. ఇకపై మన వద్ద ఆధార్‌ కార్డు లేకపోయినా స్కాన్‌ చేస్తే మన వెరిఫికేషన్ పూర్తవుతోంది. ఇందుకోసం మన దేశంలో ఆధార్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకరానున్నారు. దీనిని ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మంగళవారం ఆవిష్కరించారు. ఈ యాప్‌లో తక్షణ వెరిఫికేషన్, రియల్‌ టైం ముఖ ధ్రువీకరణ వంటి ఫీచర్లు ఈ యాప్‌లో ఉంటాయి. ధ్రువీకరణను పరిశీలించే చోట, ఆధార్‌ తనిఖీ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. దానిని మన ఆధార్‌ యాప్‌తో స్కాన్‌ చేస్తే, మన ధ్రువీకరణ అయిపోతుంది. ఇప్పుడు యూపీఐ చెల్లింపు కోసం క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసినట్లే ఇదీ పూర్తవుతుంది. పూర్తి సురక్షితంగా, అత్యంత సులువుగా ఆధార్‌ తనిఖీ జరుగుతుందని సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో వైష్ణవ్‌ పోస్ట్‌ చేశారు. ఎలా పని చేస్తుందంటే..? ఆధార్ కార్డు ముఖ ప్రామాణీకరణను ఉపయోగించడానికి మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో కొత్త ఆధార్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీని తరువాత అనుసరించాల్సిన దశలను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత మీరు ఎవరి ముఖాన్ని అయినా స్కాన్ చేయడం ద్వారా ఆధార్‌ను ధృవీకరించవచ్చు. దీనిలో సంబంధిత వ్యక్తి గురించి ముఖ్యమైన సమాచారం మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని మీరు ధృవీకరించవచ్చు. ఆధార్ కార్డు ముఖ ప్రామాణీకరణ ఫీచర్ ప్రస్తుతం బీటా టెస్టింగ్ వెర్షన్‌లో అందుబాటులో ఉందని, సామాన్యులు దీన్ని ఉపయోగించడానికి కొంచెం వేచి ఉండాల్సి రావచ్చు. ఒక్క సారి బీటా పరీక్షలు పూర్తయితే దేశవ్యాప్తంగా ఈ యాప్‌ అమల్లోకి వస్తుంది. ప్రజలు తమ వ్యక్తిగత ఫోన్‌ ద్వారా తమ గుర్తింపును భద్రంగా పంచుకోవచ్చని వైష్ణవ్‌ వివరించారు. ఇదికూడా చదవండి.... https://www.dharshininews.com/34630/