schedule Thursday, September 10, 2026

అదరగొట్టావ్.. అశ్రిత..!

calendar_today April 12, 2025
person dharshininews
అదరగొట్టావ్.. అశ్రిత..!
అదరగొట్టావ్.. అశ్రిత..! - తాండూరు చిన్నారికి ప్రెస్ అకాడమి చైర్మన్ అభినందన - చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి చేతుల మీదుగా మెమెంటోతో గౌరవం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన సీనీయర్ జర్నలిస్టు, టీయూడబ్ల్యూజే ఐజేయూ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్, పెద్దేముల్ మాజీ వైస్ ఎంపీపీ మధులత కూతురు అశ్రిత చిన్నతనంలోనే అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి చేత అదుర్స్ అనిపించుకుంది. సీనీరయ జర్నలిస్టు వేదాంత సూరీ ఆధ్వర్యంలో బాలల కోసం మొలక అనే మాసపత్రికను నిర్వహిస్తున్నారు. ఈ మాస పత్రిక ద్వారా బాలల చేత ప్రముఖుల ఇంటర్వూలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏప్రిల్ మాసంకు సంబంధించిన మెలక మాసపత్రిక ఆవిష్కరణ శనివారం హైదరాబాద్‌ లోని బషీర్‌ బాగ్ ప్రెస్‌ క్లబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రెస్ అకాడమి చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఏప్రిల్ మాసంకు సంబంధించిన ముఖచిత్రానికి బాలప్రతినిధిగా ఇంటర్వూ చేసిన ఆశ్రితను చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మెమెంటోను అందజేసి శభాష్ అని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆశ్రిత బాలలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు శ్రీనివాస్ చారి, మధులతతో పాటు ప్రెస్ క్లబ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి రాం నారాయణ, టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ, రాష్ట్ర నాయకులు వెంకట్ రెడ్డి, నరేందర్ రెడ్డి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత జనార్దన్ రెడ్డి, ప్రిన్సిపల్ రమణమ్మ, మొలక ప్రత్యేక ప్రతినిధి కేవీఎం వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34780/