schedule Thursday, September 10, 2026

అందరికి ఆదర్శం అంబేద్కర్

calendar_today April 14, 2025
person dharshininews
అందరికి ఆదర్శం అంబేద్కర్
అందరికి ఆదర్శం అంబేద్కర్ - తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి - జయంతిలో నివాళులు అర్పించిన పైలెట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేదర్కర్ అందరికి ఆదర్శ ప్రాయుడని తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహంతో పాటు పాత తాండూరు పార్కులో, రాజీవ్ కాలనీలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో ఆయన అందరికి ఆదర్శప్రాయుడుగా నిలిచారని అన్నారు. నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మాజీ ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు సంజీవరావు, వెంకట్ రెడ్డి, యూనుస్, దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేవనూర్‌లో విగ్రహావిష్కరణ యాలాల మండలం దేవనూర్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/34816/