schedule Friday, September 11, 2026

గ్రేట్.. గల్లీ బాయ్స్‌..!

calendar_today April 22, 2025
person dharshininews
గ్రేట్.. గల్లీ బాయ్స్‌..!
గ్రేట్.. గల్లీ బాయ్స్‌..! - వీధిన పడ్డ ఫోటో గ్రాఫర్‌కు ఆర్థిక చేయూత - సామాజిక సేవకు పలువురు ఫిదా తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజం మాకేమి ఇచ్చింది.. అని కాకుండా సమాజానికి మేమేం చేస్తున్నామనే సామేతకు అర్థం చెబుతున్నారు పెద్దేముల్ మండలం గాజీపూర్ గల్లీ బాయ్స్. మానవత్వంతో ఆపదలో ఉన్న వారికి తమ వంతు తోడ్పాటు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. తాజాగా ఓ ఫోటో గ్రాఫర్‌కు ఆర్థిక చేయూతను అందించి అందరి మన్ననలు పొందారు. వివరాల్లోకి వెళితే... గాజీపూర్ గ్రామానికి చెందిన సారగళ్ల శ్రీనివాస్ ఫోటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. అయితే రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో షాక్‌ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంట్లో కంప్యూటర్, ఇతర సామాగ్రి, వస్త్రాలు అన్ని పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న గాజీపూర్ గల్లీ బాయ్స్ మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సభ్యులు అంతా కలిసి సారగళ్ల శ్రీనివాస్ కు రూ. 10వేల ఆర్థిక సాయం అందజేశారు. తమవంతు సహకారం అందించి భరోసా అందించారు. గల్లీ బాయ్స్ చేయూతను తెలుసుకున్న పలువురు గ్రామస్తులతో పాటు మండల ప్రజలు అభినందిస్తున్నారు. మరోవైపు సామాజిక సేవ కోసం ఈ గల్లీ బాయ్స్ సామాజిక మాద్యమాలలో గ్రూప్‌ ఏర్పాటు చేసుకోవడం.. అందులో సమస్యలు తెలుసుకుని తోచినంత సాయం అందిస్తుండడం విశేషం. ఎంతైనా గల్లీ బాయ్స్ గ్రేట్ అంటూ పలువురు కొనియాడుతున్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35042/