schedule Thursday, September 10, 2026

రేపు ఎంసెట్ మాక్ టెస్ట్..!

calendar_today April 26, 2025
person dharshininews
రేపు ఎంసెట్ మాక్ టెస్ట్..!
రేపు ఎంసెట్ మాక్ టెస్ట్..! - సింధూ డిగ్రీ కాలేజీలో పరీక్ష - అభ్యర్థులకు ఆహ్వానం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సింధూ డిగ్రీ కాలేజీలో రేపు ఎంసెట్(ఎప్ సెట్) మాక్ టెస్ట్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సింధూ కాలేజీ, సేవా భారతీ, హిందూ ధార్మిక పరిషత్ సంయుక్తంగా ఎంసెట్ మాక్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు. సింధూ డిగ్రీ కాలేజీలోని పరీక్ష కేంద్రంను మాక్ టెస్ట్ కు విద్యార్థులు హాజరుకావచ్చు. ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాక్ టెస్ట్ లో పాల్గొనవచ్చు. ఎంసెట్ హాల్ టిక్కెట్ జిరాక్స్ తో మాక్ టెస్ట్ రాయడానికి అవకాశం కల్పించారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఉదయం 9.30 గంటలకు ఆదర్శనగర్ లోని సింధూ డిగ్రీ కాలేజీ పరీక్ష కేంద్రంకు చేసుకోవాలి..మాక్ టెస్ట్ ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగుస్తుంది. పరీక్ష రాసే విద్యార్థులు సెల్ ఫోన్ లు తీసుకరావద్దని నిర్వాహకులు సూచించారు. ఈ అవకాశంను ఎంసెట్ పరీక్షకు సిద్దమవుతున్న విద్యార్థులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35168/