schedule Thursday, September 10, 2026

మహారాష్ట్రలో మన తెలుగోడికి గౌరవం

calendar_today April 27, 2025
person dharshininews
మహారాష్ట్రలో మన తెలుగోడికి గౌరవం
మహారాష్ట్రలో మన తెలుగోడికి గౌరవం - మహారాష్ట్ర రత్న అవార్డుతో సత్కారం - ఎఫ్ఎస్ గిరిని అభినందిస్తున్న సొంతూరోళ్లు - తాండూరు ప్రాంత వాసిని నెమరేసుకున్న ప్రజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మహరాష్ట్రలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం యాలాల మండలానికి చెందిన మన ప్రాంత వాసికి మహారాష్ట్ర రత్న అవార్డు అందజేశారు. ఆయనే యాలాల మండలం పగిడిపల్లికి చెందిన ఎఫ్ఎస్ గిరి. చాలా ఏళ్ల క్రితం చిన్నతనంలోనే ఎఫ్ఎస్ గిరి మహారాష్ట్ర ప్రాంతానికి వలస వెళ్లారు. ఎంతో కష్టపడి అక్కడే స్థిరపడి వృద్ధిలోకి వచ్చారు. కొన్నేళ్ల నుంచి మహరాష్ట్ర ప్రాంతంలో కాలేజీ విద్యాసంస్థలు నడిపడిపిస్తున్నారు. దాదాపు 5 కాలేజీలు నడిపిస్తున్నట్లు గ్రామస్తులు గుర్తుచేశారు. ఏఎంఈ, బీఎస్సీ, అవిషన్ ఇన్సుట్యూట్ ద్వారా ఇందిర ఇన్సుట్యూట్ ఆఫ్ ఏయిర్ క్రాఫ్ట్ ఇంజనీరింగ్ కాలేజీ వ్యవస్థాపకులు ఉన్నారు. ఎఫ్ఎస్ గిరి అందిస్తున్న సామాజిక సేవ, విద్యారంగ అభివృద్ధికి చేస్తున్న కృషికి గాను అక్కడి శాలిని ఫౌండేషన్ అండ్ సెలబ్రిటీ ఇండియా న్యూస్ ప్రతినిధులు ఎఫ్ఎస్ గిరికి మహారాష్ట్ర రత్న అవార్డుతో సత్కరించారు. ఈ విషయం తెలుసుకున్న యాలాల మండలంలోని సోంతూరు వాళ్లు ఎఫ్ఎస్ గిరిని అభినందిస్తున్నారు. ఎఫ్ఎస్ గిరి జుంటుపల్లిలోని రామస్వామి భక్తుడు కూడా. ఆయన ఆశీర్వాదంతోనే యాలాల నుంచి మహారాష్ట్రకు వలస వెళ్లి ఉన్నత వ్యక్తిగా ఎదిగారని గ్రామస్తులు గుర్తుచేస్తున్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35212/