schedule Thursday, September 10, 2026

సర్కారు బడుల్లో బాలికల సత్తా...!

calendar_today April 30, 2025
person dharshininews
సర్కారు బడుల్లో బాలికల సత్తా...!
సర్కారు బడుల్లో బాలికల సత్తా...! - పర్వాలేదనిపించిన అమ్మాయిలు - తాండూరులో 68శాతం ఉత్తీర్ణత నమోదు - ప్రకటించిన ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తాండూరు/ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలు సత్తా చాటారు. బుధవారం విడుదైలన పదో తరగతి ఫలితాలలో అబ్బాయిలకన్నా అమ్మాయిలు పర్వాలేదనిపించారు. తాండూరు మండలంతో పాటు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారు. బెల్కటూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఇ. భవాని 441, మల్కాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వి. మహేష్ 435, జినుగుర్తి జెడ్పీ ఉన్నత పాఠశాలలో నంనదిని బాయి 363, చెంగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో, కరన్కోట్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఐశ్వర య్య 521, ప్రభుత్వ జీజేసీ నెంబర్-2 ఉర్దూ మీడియం స్కూల్లో తరుణం బేగం 426, ప్రభుత్వ నెంబర్-2 ఉర్దూ మీడియం స్కూ ల్లో ఖుషి నాజ్ 473, 426, ఇంద్రానగర్ ప్రభుత్వ ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో జారా సుహానా 466, మల్రెడ్డిపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలలో పద్మ 417, తాండూరు జీజేసీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రియాంక 325, తాండూరులోని ప్రభుత్వ నెంబర్లో తెలుగు మీడియంలో సాదియా ఖాతూన్ 535, ప్రభుత్వం నెంబర్-1 ఉర్దూ మీడియంలో అమ్లా బేగం 458, ప్రభుత్వ బాలికల పా ఠశాల ఉర్దూ మీడింలో అఫియాభాను 502, పాత తాండూరు నెంబర్-2 పాఠశాలలో యు. మహేశ్వరి 509, కేజీబీవీలో మేఘన 485, టీఎస్ఎంఎస్లో జి. అక్షర, 503, తెలంగాణ రెసిడెన్షియల్లో సాత్విక 561మార్కులు సాధించినట్లు మండల విద్యాధికారి వెంకటయ్య తెలిపారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35323/