schedule Thursday, September 10, 2026

టాప్‌ లేపిన శ్రీ గాయత్రి

calendar_today April 30, 2025
person dharshininews
టాప్‌ లేపిన శ్రీ గాయత్రి
టాప్‌ లేపిన శ్రీ గాయత్రి - టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు - 100% ఉత్తీర్ణతతో ప్రభంజనం కోడంగల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా కోడంగల్‌లోని శ్రీ గాయత్రి స్కూల్ టెన్త్‌ ఫలితాలలో టాప్ లేపింది. వందశాతం ఉత్తీర్ణతతో స్కూల్ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. తిరుగులేని ఫలితాలతో స్కూల్‌ విజయకేతనం ఎగురవేసింది. బుధవారం విడుదలైన పదవ తరగతి రిజల్ట్ లో కొడంగల్ లోని శ్రీ గాయత్రి పాఠశాల విద్యార్థుల తన ప్రతిభను కనబరిచారు. పదవ తరగతి విద్యార్థులు అస్మిత 546/600 మార్కులు సాధించి పాఠశాల టాప్పర్ గా నిలిచింది. కారుణ్య 530/600 మార్కులు, అవినాష్ 523/600, కార్తీక్ 514, మార్కులు సాధించారు. పాఠశాల లో 100% రిజల్ట్స్ తో కొడంగల్ లో ఉత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభ కనబరిచారు. దాదాపు నలుగురు విద్యార్థులు 500/ పైగా మార్కులు సాధించారు. దింతో పాఠశాల కరెస్పాండంట్ రాము విద్యార్థులను సన్మానించారు. తమ పాఠశాలలో 100% రిజల్ట్స్ రావడం హర్షానియమన్నారు. విద్యార్థుల కృషి వల్లే ఉత్తమ ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పాఠశాల సిబ్బంది రంజిత, ఇస్మాయిల్, రమేష్, శ్రవణ్ తదితరులు ఉన్నారు. ఇది కూడా చదవండి.... https://www.dharshininews.com/35332/