schedule Thursday, September 10, 2026

రైతుల వద్దకే శాస్త్రవేత్తలు..!

calendar_today May 4, 2025
person dharshininews
రైతుల వద్దకే శాస్త్రవేత్తలు..!
రైతుల వద్దకే శాస్త్రవేత్తలు..! - సర్కారు కార్యక్రమానికి సర్వం సిద్దం - రేపటి నుంచి అవగాహన కార్యక్రమాలు - వ్యవపరిశోధనా స్థానం నుంచి షెడ్యూల్‌ ప్రకటన - విజయవంతం చేయాలని డా. సుధారాణి పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : వానాకాలం పంటల సాగులో రైతులను సమాయత్తం చేసేందుకు సర్కారు సిద్దమైంది. మెరుగైన సాగు పద్దతులపై రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమంతో రైతులకు భరోసా అందించబోతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపటి నుంచి తాండూరు నియోజకవర్గంలో 'రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు' కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా.సి.సుధారాణి తెలిపారు. ఇందులో భాగంగా నేటి నుంచి జూన్ 13వ తేది వరకు రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాలు జరుగుతాయని షెడ్యూల్ ను ప్రకటించారు. ఈనెల 5వ తేదిన తాండూరు మండలం బెల్కటూర్, 15వ తేదిన యాలాల మండల కేంద్రం, 23వ తేదిన పెద్దేముల్ మండల కేంద్రం, 31వ తేదిన బషీరాబాద్ మండలం నవాంధిలో రైతు వేదికల వద్ద అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. వ్యవసాయ శాఖ అధికారులతో పాటు వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొని వానాకాలంలో రైతులు సాగు చేసే పంటలపై అవగాహన కల్పిస్తారని చెప్పారు. మెరుగైన సాగు పద్దతులపై రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తారని తెలిపారు. కావున అధికారులతో పాటు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35447/