schedule Thursday, September 10, 2026

తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ బదిలీ

calendar_today May 16, 2025
person dharshininews
తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ బదిలీ
తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ బదిలీ - కుల్కచర్ల ఎస్ఐగా స్థానచలనం - ఉత్తర్వులు జారీ చేసిన పోలీసు శాఖ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ ఎస్ఐ రమేష్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాండూరు పట్టణ ఎస్ఐగా రమేష్ సుమారు 5నెలల క్రితం విధుల్లో చేరారు. తాండూరు పట్టణానికంటే ముందు తాండూరు సబ్ డివి జన్ బషీరాబాద్ పోలీస్టేషన్ లో ఎస్ఐగా విధులు నిర్వహించి సెలవు తీసుకున్నారు. సెలవుల పూర్తి అనంతరం తాండూరు పట్టణ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా ఆయనను తాండూరు పట్టణం నుంచి వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గం కుల్కచర్ల మండలం పోలీస్టేషన్ కు ఎస్ఐగా బదిలీ చేశారు. సెలవుల్లో ఉన్న సమయంలో ఎస్ఐ రమేష్‌ గ్రూప్స్ పరీక్షలు రాశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35574/