schedule Thursday, September 10, 2026

నిరుద్యోగ యువతకు గోల్డెన్స్ చాన్స్..!

calendar_today May 21, 2025
person dharshininews
నిరుద్యోగ యువతకు గోల్డెన్స్ చాన్స్..!
నిరుద్యోగ యువతకు గోల్డెన్స్ చాన్స్..! - ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జాబ్ మేళా - 50 కంపెనీలలో 10 వేల ఉద్యోగాలకు ఇంటర్వూలు - తాండూరులో డేట్, ప్లేస్, టైం, అర్హత ఇదే.. - జాబ్‌కు సెలెక్ట్ కానివాళ్లకు ఉచిత ఆఫర్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గోల్డెన్స్ చాన్స్ ఇచ్చేందుకు సిద్దమయ్యారు. గతంలో జాబ్ మేళా నిర్వహించి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. తాజాగా మరోసారి ఆయన ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ నెల 29న తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మెగా ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ మార్కెటింగ్ మిషన్ (ఈజీఎంఎం) ఆధ్వర్యంలో మెగా ఉద్యోగ మేళా నిర్వహించడం జరుగుతుందని, ఈ అవకాశన్నీ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జాబ్ మేళాలో మార్కెటింగ్, సేల్స్,ఫార్మసీ, నర్సింగ్ ,రియల్ ఎస్టేట్ , ఐటీ,బ్యాంకింగ్, సెక్యూరిటీ తో పాటు తదితర రంగాలలో 50 ప్రైవేట్ కంపెనీలలో దాదాపు 10,000 ఖాళీలకు ఎంపిక ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పదో తరగతితో పాటు పీజీ పాస్ అయిన, 18 నుంచి 55 సంవత్సరాల వయసు గల యువతి యువకులు విద్యార్హత సర్టిఫికెట్స్ తో మేళలో పాల్గొని ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా జాబ్ మేళాలో ఉద్యోగం పొందని వారికీ కూడా ఉచితంగా 3 నెలల పాటు వసతితో పాటు భోజన సౌకర్యంతో శిక్షణ ఇచ్చి, ఉద్యోగం కూడా ఇప్పిస్తామని స్పష్టం చేశారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35640/