schedule Thursday, September 10, 2026

బీఆర్ఎస్ నేత ఇంట విషాదం..!

calendar_today May 26, 2025
person dharshininews
బీఆర్ఎస్ నేత ఇంట విషాదం..!
బీఆర్ఎస్ నేత ఇంట విషాదం..! - మండల పార్టీ అధ్యక్షునికి మాతృ వియోగం - మాజీ వైస్ ఎంపీపీ అత్తగారి కన్నుమూత - డీసీసీబీ మాజీ చైర్మన్ సతీమణి అకాల మరణం తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఇంట విషాధం నెలకొంది. ఉమ్మడి జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ సిరిగిరిపేట్ సాయిరెడ్డి సతీమణి, తాండూరు మండల మాజీ వైస్ ఎంపీపీ అత్తగారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, వెంకట్రామ్ రెడ్డిల తల్లి సిరిగిరిపేట్ నర్సమ్మ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తాండూరు పట్టణంలోని పెద్ద కుమారుడు వీరేందర్ రెడ్డి నివాసంలో తుదిశ్వాస విడిచారు. దీంతో వారి కుటుంబంలో విషాధం నెలకొంది. ఆమె భౌతిక ఖాయాన్ని కోటబాస్పల్లి గ్రామంలోని వారి నివాసానికి తరలించారు. ప్రజలు నర్సమ్మను కడసారి చూసేందుకు ఏర్పాట్లు చేశారు. మంగళవారం స్వగ్రామం కొ టబాస్పల్లిలో ఉదయం 11-30 లకు వారి వ్యవసాయ క్షేత్రంలో ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వీరేందర్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీఆర్ఎస్ నేత ఇంట్లో నెలకొన్న విషాధంపై బీఆర్ఎస్ పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీలకు చెందిన నేతలు, నాయకులు కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటించారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35732/