schedule Thursday, September 10, 2026

శభాష్.. క్రాంతి కుమార్..!

calendar_today May 28, 2025
person dharshininews
శభాష్.. క్రాంతి కుమార్..!
శభాష్.. క్రాంతి కుమార్..! - గ్రూప్-1, గ్రూప్-2కు ఎన్నికైన తాండూరు యువకుడు - అభినందించిన తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు - సన్మానించిన సంఘాల నాయకులు, బందు మిత్రులు తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : శభాష్ కురువ క్రాంతి కుమార్ అంటూ తాండూరుకు చెందిన యువకున్ని పలువురు అభినందించారు. గ్రూప్-1, గ్రూప్ - 2లలోని రెండు పోస్టులకు తాండూరుకు చెందిన క్రాంతి కుమార్ ఉద్యోగాలు సాధించాడు. తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కురువ గోపాల్ కుమారుడు కురువ క్రాంతి కుమార్ ఇటీవల జరిగిన గ్రూప్ - 1, గ్రూప్ - 2 పోస్టులలో ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు. తాజాగా ఆయా విభాగాల్లోకి రెండు ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తాండూరు ప్రాంతం నుంచి గ్రూప్ - 1 పోస్టుకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం క్రాంతి కుమార్ ను తెలంగాణ బార్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యులు చలకాని వెంకట్ యాదవ్ అభినందించారు. అదేవిధంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, సంఘం సభ్యులు సయ్యద్ షుకూర్, అరుణ్ రాజ్ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/35820/