schedule Friday, September 04, 2026

పేదలకు మెరుగైన వైద్యంతో సేవ

calendar_today June 7, 2025
person dharshininews
పేదలకు మెరుగైన వైద్యంతో సేవ
పేదలకు మెరుగైన వైద్యంతో సేవ - వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు - జయరాం తాండాలో ఉచిత వైద్య శిబిరం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చొరవ చూపుతుందని ఆసుపత్రి వైద్యులు అన్నారు. శనివారం పెద్దేముల్ మండలం జయరాం తాండాలోని భవానీ మాత ఆలయం వద్ద వినాయక ఆసుపత్రి ఆధ్వర్యంలో గిరిజనుల కోసం ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఆసుపత్రికి చెందిన ఎండి డా. చందర్ నాయక్, ఈఎన్టీ డా. రవీందర్ రాజా, డా. నితిన్ లతో పాటు సిబ్బంది హాజరై వైద్య సేవలు అందించారు. జయరాం తాండాతో పాటు పరిసర ప్రాంతాలు ఓమ్లానాయక్ తండా, రచ్చకట్ట తాండా, ఫాషాపూర్, బాయిమీది తాండా, కర్ణాటక సరిహద్దు షాదీపురం నుంచి వచ్చి ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు జయరాం నాయక్, గెమ్యా నాయక్, శివరాం నాయక్, మాజీ ఎంపీటీసీలు బాబు సింగ్, దేవాలయ అధ్యక్షులు రాంశెట్టి, ఆసుపత్రి ప్రతినిధులు ఆకాంక్ష, మార్కెటింగ్ మేనేజర్ సంతోష్ రాథోడ్, శ్రీకాంత్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36014/