schedule Friday, September 11, 2026

శభాష్.. హరీష్ గౌతమ్..!

calendar_today June 14, 2025
person dharshininews
శభాష్.. హరీష్ గౌతమ్..!
శభాష్.. హరీష్ గౌతమ్..! - టీచర్ కొడుకు నీట్లో మెరిశాడు - ఆల్ ఇండియాలో 660వ ర్యాంకు - అభినందించిన తల్లిదండ్రులు, సన్నిహితులు తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశ వ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో ప్రవేశ కోసం నిర్వహించిన నీట్ పరీక్షా ఫలితాల్లో తాండూరు నియోజకవర్గానికి చెందిన హరీష్ గౌతమ్ అనే విద్యార్థి సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో 660వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. యాలాల మండలం బెన్నూరు గ్రామానికి చెందిన లక్ష్మీకాంత రావు, విద్యారాణిల కుమారుడు హరీష్ గౌతమ్ ఇటీవల నీట్ పరీక్షకు హాజరయ్యాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో హరీష్ గౌతమ్ జాతీయ స్థాయిలో 660వ ర్యాంకు సాధించాడు. ఇక రాష్ట్ర స్థాయిలో 416వ ర్యాంకు సాధించాడు. అన్ని సబ్జెక్టుల్లో 99శాతంకు పైగా ఉత్తీర్ణతతో 614 మార్కులు సాధించడం విశేషం. ఇదిలా ఉండగా హరీష్ రావు తండ్రి లక్ష్మీకాంల్రావు ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా కొనసాగుతున్నారు. దీంతో పాటు తపస్ రాష్ట్ర కోశాధికారిగా సేవలందిస్తున్నారు. నీట్ లో హరీష్ గౌతమ్ సాధించిన ఘనతకు తల్లిదండ్రులతో పాటు స్నేహితులు, సన్నిహితులు అభినందిస్తున్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36176/