schedule Friday, September 11, 2026

రాజ్ పుత్ మహిళ సంఘానికి కొత్త మహిళా సారధులు

calendar_today June 14, 2025
person dharshininews
రాజ్ పుత్ మహిళ సంఘానికి కొత్త మహిళా సారధులు
రాజ్ పుత్ మహిళ సంఘానికి కొత్త మహిళా సారధులు - ఒకేసారి జిల్లా, తాండూరు పట్టణ సభ్యుల నియామకం - ఓటింగ్ ద్వారా ఎన్నుకున్న సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని రాజ్ పుత్ మహిళ సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. శనివారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ పారామెడికల్ కాలేజీలో సంఘం ఎన్నిక సమావేశం నిర్వహించారు. ఒకేసారి వికారాబాద్ జిల్లా, తాండూరు పట్టణ కార్యవర్గ సభ్యుల నియామకం చేపట్టారు. ఓటింగ్ పద్దతిలో రెండు కార్యవర్గాలను ఎన్నుకున్నారు. వికారాబాద్ జిల్లా అధ్యక్షురాలుగా నిఖిత దిలీప్ సింగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శిగా ఎరన్ పల్లి సురేఖా కిషన్ సింగ్, తాండూరు పట్టణ అధ్యక్షురాలుగా అర్చన శంకర్ సింగ్, ప్రధాన కార్యదర్శిగా స్వప్న ఉమేష్ సింగ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాజ్ పుత్ మహిళ సంఘం అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ పుత్ సమాజం పెద్దలు, సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఇదికూడా చదవండి... https://www.dharshininews.com/36182/